హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. గతేడాది 19.54 కోట్ల మొక్కలు నాటడం టార్గెట్‌గా ఉండగా, ఈసారి దాన్ని 19.24 కోట్లకు తగ్గించారు. ఇందులో 7 కోట్ల మొక్కలను హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నాటాలని నిర్ణయించారు.
ములుగు జిల్లాకు అత్యల్పంగా 14.79 లక్షల టార్గెట్ పెట్టిన ప్రభుత్వం, రంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా 78.57 లక్షల లక్ష్యాన్ని పెట్టింది. 2015లో హరితహారం తొలి విడత ప్రారంభమవగా, ఇప్పటివరకూ జరిగిన 8 విడతల్లో 273.33 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కార్ చెబుతోంది.