అక్టోబర్ 3 నుంచి బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడుతుండగా.. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఆరుసార్లు ప్రపంచ కప్ విజేత.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక గ్రూప్- ఏలో ఉండగా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు గ్రూప్- బిలో ఉన్నాయి.
తాజాగా, ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవన్నది భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంచనా వేసింది. నాకౌట్ చేరే నాలుగు జట్లలో భారతదేశాన్ని ఒకటిగా ఎంచుకున్న హర్మన్ ప్రీత్.. మిగిలిన మూడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా అని తెలిపింది. అలాగే, ఏళ్ల తరబడి ఐసీసీ ఈవెంట్లలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది. అక్టోబరు 13న సిల్హెట్‌లో జరిగే చివరి లీగ్ గేమ్‌లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది.
గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్
- అక్టోబర్ 3: ఇంగ్లండ్ v దక్షిణాఫ్రికా (ఢాకా)
- అక్టోబర్ 3: బంగ్లాదేశ్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 4: ఆస్ట్రేలియా v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 4: భారత్ v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా v వెస్టిండీస్(ఢాకా)
- అక్టోబర్ 5: బంగ్లాదేశ్ v ఇంగ్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 6: న్యూజిలాండ్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 6: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (సిల్హెట్)
- అక్టోబర్ 7: వెస్టిండీస్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 8: ఆస్ట్రేలియా v పాకిస్థాన్ (సిల్హెట్)
- అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ (ఢాకా)
- అక్టోబర్ 9: భారత్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 11: ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 11: పాకిస్థాన్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 12: ఇంగ్లండ్ v వెస్టిండీస్ (ఢాకా)
- అక్టోబర్ 12: బంగ్లాదేశ్ v సౌతాఫ్రికా (ఢాకా)
- అక్టోబర్ 13: పాకిస్థాన్ v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 13: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (సిల్హెట్)
- అక్టోబర్ 14: ఇంగ్లాండ్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 17: సెమీ ఫైనల్ 1 (సిల్హెట్)
- అక్టోబర్ 18: సెమీ ఫైనల్ 2 (ఢాకా)
- అక్టోబర్ 20: ఫైనల్ (ఢాకా)