వరల్డ్ కప్ లో భారత్ కు బిగ్ షాక్. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు గాయమైంది. 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో హర్మన్ ఛేజింగ్ లో క్రీజ్ లో పాతుకుపోయింది. చిన్నగా ఆడుతూ భారత్ ను గెలుపు దిశగా తీసుకెళ్తుంది. అయితే విజయానికి మరో రెండు పరుగులు కావాల్సిన దశలో ఆమె దూరంగా వెళ్తున్న స్పిన్ బాల్ ను ఆడడంలో విఫలమైంది. ఈ క్రమంలో తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక పోయింది.
Also Read :- స్టన్నింగ్ క్యాచ్‌తో ధోనీని గుర్తు చేసిన రిచా
స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో వెనక నుంచి డైవ్ చేయగా.. ఆమె మెడకు గాయమైంది. దీంతో క్రీజ్ లోనే పడిపోయి అసౌకర్యంగా కనిపించింది. బ్యాటింగ్ చేయలేక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగింది. హర్మన్ కు గాయం తీవ్రమైతే భారత్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే. కౌర్ లేకుండా సెమీస్ కు వెళ్లడం భారత్ కు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో ఒక ఫోర్ తో 29 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ ఓడిపోగా.. తాజాగా పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో ఒక ఫోర్ తో 29 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ విధించిన స్వల్ప (106) లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేజ్ చేసింది. షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, రోడ్రిగ్స్ జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన నిదా దార్ టాప్ స్కోరర్ గా నిలిచింది.