WPL 2025: నీ పని నువ్వు చూసుకో.. ఇంగ్లాండ్ క్రికెటర్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఫైర్

WPL 2025: నీ పని నువ్వు చూసుకో.. ఇంగ్లాండ్ క్రికెటర్‌పై హర్మన్ ప్రీత్ కౌర్ ఫైర్

డబ్ల్యూపీఎల్‌‌‌‌లో మాటల యుద్ధం జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్,సోఫీ ఎక్లెస్టోన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముంబై ఇండియన్స్ పై యూపీ వారియర్స్‌‌‌‌ మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు ఇన్నింగ్స్ చివరి దశలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19 ఓవర్ లో అమీలియా కెర్ బౌలింగ్ కు వచ్చినప్పుడు అంపైర్ ముంబై కెప్టెన్ కౌర్ తో మాట్లాడుతూ.. స్లో ఓవర్ రేట్ కారణంగా సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లే అనుమతించడానికి వీలుంటుంది అని చెప్పాడు.

అంపైర్ నిర్ణయంపై హర్మన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంపైర్ దగ్గరకు వెళ్లి తన వాదన వినిపిస్తుంది. కెర్ కూడా అంపైర్ నిర్ణయంపై నిరాశ చెందింది. కౌర్ అంపైర్ తో మాట్లాడుతునప్పుడు యూపీ వారియర్స్‌‌‌‌ బౌలర్, ఇంగ్లాండ్ క్రికెటర్ ఎక్లెస్టోన్ అంపైర్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుంది. ఈ విషయం ముంబై కెప్టెన్ కు నచ్చలేదు. అంపైర్ తో నీకేంటి పని.. నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా ఎక్లెస్టోన్ వైపుగా చేయి చూపిస్తూ కోపంగా మాట్లాడింది. ఎక్లెస్టోన్ కూడా కౌర్ పై విరుచుకుపడి కోపంగా మాట్లాడింది. మధ్యలో అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరినీ ఎవరి స్థానాలకు వారిని పంపించారు. 

Also Read:-కవలలకు తండ్రి కాబోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్..

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఛేజింగ్‌‌‌‌లో నిలకడగా ఆడిన ముంబై ఇండియన్స్‌‌‌‌.. డబ్ల్యూపీఎల్‌‌‌‌లో కీలక విజయాన్ని అందుకుంది. హేలీ మాథ్యూస్‌‌‌‌ (46 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 68), సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ (37) చెలరేగడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌‌‌కు చెక్‌‌‌‌ పెట్టింది. తద్వారా ప్లే ఆఫ్స్‌‌‌‌కు మరింత చేరువైంది. టాస్‌‌‌‌ ఓడిన యూపీ 20 ఓవర్లలో 150/9 స్కోరు చేసింది. జార్జియా వోల్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లతో 55), గ్రేస్‌‌‌‌ హారిస్‌‌‌‌ (28), దీప్తి శర్మ (27) మెరుగ్గా ఆడారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 153/4 స్కోరు చేసింది. మాథ్యూస్‌‌‌‌ కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.