
లాసానె (స్విట్జర్లాండ్): ఇండియా హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఎఫ్‌ఐహెచ్ అవార్డులకు షార్ట్‌లిస్ట్ అయిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. హర్మన్, శ్రీజేష్ ఇండియా రెండోసారి ఒలింపిక్ మెడల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం హర్మన్.. బ్రింక్‌మన్ (నెదర్లాండ్స్), జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), హనెస్ ముల్లర్ (జర్మనీ), జాక్ వాలెస్ (ఇంగ్లండ్)తో పోటీపడుతున్నాడు.
శ్రీజేష్‌కు పిర్మిన్ బ్లాక్ (నెదర్లాండ్స్), లూయిస్ కాల్జాడో (స్పెయిన్), జీన్ పాల్ డానెబర్గ్ (జర్మనీ), శాంటియాగో (అర్జెంటీనా) నుంచి పోటీ ఉంది. అక్టోబర్ 11వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఓటింగ్ ప్రక్రియలో ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్, నేషనల్ అసోసియేషన్స్, ఫ్యాన్స్, ప్లేయర్లు, కోచ్‌లు, అఫీషియల్స్, మీడియా ఓటు వేయవచ్చు.