తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సినిమాకు హైలైట్‌‌

తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సినిమాకు హైలైట్‌‌

సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు చిత్ర నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందనతో పాటు, మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. అలాగే కలెక్షన్స్ బాగున్నాయి. చాలా చోట్ల హౌస్‌‌ఫుల్‌‌గా రన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీ.  

ఇండస్ట్రీ నుంచి దర్శకులు మారుతి, సంపత్ నంది లాంటి వారు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారు. హీరో, దర్శకుడిపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాం. అదే ఈ రోజు మాకు విజయాన్ని ఇచ్చిందనుకుంటున్నాం. తండ్రీ కొడుకుల సెంటిమెంట్, ఫైట్స్, మ్యూజిక్ సినిమాకు హైలైట్‌‌గా నిలిచాయి.  సుధీర్ బాబు గారితో కలసి పనిచేయడం గుడ్ ఎక్స్‌‌పీరియెన్స్. ఈ చిత్రానికి మరింత రెస్పాన్స్ వస్తే..  సీక్వెల్ చేయాలనుకుంటున్నాం. అలాగే మరో మూడు ప్రాజెక్ట్స్‌‌లో లైన్‌‌లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.