టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan), విలక్షణ దర్శకుడు విఐ ఆనంద్(VI Anand) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona). సూపర్ నేచురల్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ వర్ష బోళ్ళమా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హస్య మూవీస్ బ్యానర్స్ పై అనిల్ సుంకర, రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
ALSO READ:- హీరోయిన్ నాకు హగ్ ఇవ్వలేదు.. దర్శకుడు త్రినాథరావ్ ఆసక్తికర కామెంట్స్
అయితే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఆతరువాత కూడా పలు రిలీజ్ డేట్స్ మార్చుకుంది ఈ సినిమా. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది ఊరు పేరు భైరవకోన. దీంతో ప్రమోషన్ పనుల్లో వేగం పెంచేశారు.
ఇందులో భాగంగా తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమా నుండి హరోం హర అనే పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆధ్యాత్మికతతో నిండిన ఈ పాటను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతంగా కంపోజ్ చేశారు. పాటలోని పదాలు వింటుంటే ఒక్కసారిగా గూస్బంప్స్ ఫీలింగ్ కలుగుతోంది. ఇక పాటగా వింటేనే ఈ రేంజ్ లో ఉందంటే విజువల్ గా ఏ రేంజ్ లో ఉంటుందో ఆంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.