IPL 2024: సెంటి‌మెంట్‌తో కొట్టాడు: బ్రూక్ తప్పుకోవడం వెనుక అసలు కారణం ఇదే

IPL 2024: సెంటి‌మెంట్‌తో కొట్టాడు: బ్రూక్ తప్పుకోవడం వెనుక అసలు కారణం ఇదే

ఐపీఎల్ నుంచి ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒకొక్కరుగా తప్పుకోవడంతో వారికి ఈ మెగా లీగ్ మీద ఆసక్తి లేదనుకున్నారు. మిగిలిన ఆటగాళ్ల విషయం ఎలాగున్నా ఇంగ్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ మాత్రం తాను తప్పుకోవడానికి అసలు కారణం చెప్పి సెంటి‌మెంట్‌తో కట్టి పడేశాడు. తనకెంతో ఇష్టమైన అమ్మమ చనిపోవడం వలనే బ్రూక్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఇంస్టాగ్రామ్ వేదికగా బ్రూక్ మాట్లాడుతూ.."ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను దక్కించుకోవడంతో సంతోషంగా అనిపించింది. ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ఆడాలని ఆతృతగా ఎదురు చూశాను. సహజంగా నా వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడను. కానీ బయట ఎందుకు అని నన్ను చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అందుకని అందరితో ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. 

ఫిబ్రవరి నెలలో మా అమ్మమ్మ చనిపోయింది. ఆవిడ నా కెరీర్ ముందుకు కొనసాగడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నా బాల్యంలో ఎక్కువ సమయం ఆమె దగ్గరే గడిపాను. క్రికెట్ మీద ఆసక్తి కలగడానికి ఆమె కారణం. నా అంతర్జాతీయ క్రికెట్ ఆమె చూసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది". అని బ్రూక్ తన అమ్మమ్మ మీద ఉన్న ప్రేమను తెలియజేశాడు.

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తానికి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వలన బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే అసలు కారణం మాత్రం బ్రూక్ అప్పుడు చెప్పలేదు. దీంతో ఇతని స్థానంలో ఇంగ్లాండ్ క్రికెట్ డానియల్ లారెన్స్ ను ఎంపిక చేసింది. ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడనుకున్నా నిన్న తాను ఈ మెగా లీగ్ లో ఆడట్లేదని చెప్పడంతో అతని స్థానంలో ఫ్రేజర్ మెక్‌గుర్క్ఎం ను ఎంపిక చేసింది. బ్రూక్ ను 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూ.4 కోట్లకు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.