క్రికెట్లో కొన్ని క్యాచులు యావరేజ్ అనిపిస్తాయి. మరికొన్ని క్యాచులు అద్భుతం అనిపిస్తాయి. ఇంకొన్ని క్యాచులైతే అదుర్స్ అనిపించేలా చేస్తాయి. కానీ నేను చెప్పే క్యాచ్ను చూస్తే మాత్రం..కిర్రాక్ అనాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో ఈ క్యాచ్ను చూసిన తర్వాత వాహ్వా అనకతప్పదు మరి.
ది హండ్రడ్ లీగ్‌లో భాగంగా నార్తెర్న్ సూపర్ చార్జర్స్, వెల్ష్ ఫైర్ మధ్య మ్యా్చ్ జరుగుతోంది. ఈ గేమ్లో నార్తెర్న్ సూపర్ చార్జర్స్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్ దగ్గర విన్యాసాలు చేస్తూ క్యాచ్ అందుకున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు.
వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ టైమింగ్లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతిని మైదానంలో విసిరేశాడు. ఈ క్రమంలో అప్పటికే బౌండరీ లైన్ వద్ద ఉన్న మరో ఫీల్డర్ హోస్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన జానీ బెయిర్ స్టో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రస్తతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023