ENG v WI 2024: 14 టెస్టుల్లో 1376 పరుగులు.. బ్రాడ్ మన్ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ యువ క్రికెటర్

ENG v WI 2024: 14 టెస్టుల్లో 1376 పరుగులు.. బ్రాడ్ మన్ తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ యువ క్రికెటర్

ఇంగ్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ పక్కన పెడితే టెస్టుల్లో ఈ ఇంగ్లీష్ బ్యాటర్ తగ్గేదే లేదంటున్నాడు. 25 ఏళ్ళ వయసులోనే అసాధారణ నిలకడ చూపిస్తున్నాడు. కఠినమైన టెస్టు ఫార్మాట్ లో అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఓ వైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు తన ఇన్నింగ్స్ కు దూకుడును జత చేస్తున్నాడు.  ప్రస్తుతం సొంతగడ్డపై వెస్టిండీస్ పై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ సత్తా చూపిస్తున్నాడు. 

3 ఇన్నింగ్స్ లో 195 పరుగులు చేసి తన మార్క్ చూపించాడు. వీటిలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. తొలి టెస్టులో ఒకే ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ 50 పరుగులు.. రెండో టెస్టులో వరుసగా 36,109 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కనీసం 20 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్ లు ఆడి  అత్యధిక యావరేజ్ కలిగిన ఆటగాళ్ల లిస్టులో బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. బ్రూక్స్ ప్రస్తుత యావరేజ్ 62.55 కావడం విశేషం. 

Also Read:బుమ్రా ఒక్కడికే ఆ మినహాయింపు.. లంక సిరీస్‌కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ డాన్ బ్రాడ్ మన్ 99.94 యావరేజ్ తో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆడమ్ ఓజెస్(61.87), గ్రేమ్ పొలాక్ (60.97) , జార్జ్ హెడ్ల్ (60.83) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు బ్రూక్ 13 టెస్టుల్లో 23 ఇన్నింగ్స్ లు ఆడి 1376 పరుగులు చేశాడు. వీటిలో 5 సెంచరీలు.. 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 90 ఉండడం విశేషం. బ్రూక్ తన ఫామ్ ను కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం.