Harry Brook: స్టోక్స్‌కు నో ఛాన్స్: బట్లర్ స్థానంలో వన్డే, టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్!

Harry Brook: స్టోక్స్‌కు నో ఛాన్స్: బట్లర్ స్థానంలో వన్డే, టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెట్!

ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం (ఏప్రిల్ 7) బ్రూక్ ను కెప్టెన్ గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. బట్లర్ స్థానంలో బ్రూక్ సారధ్య బాధ్యతలను స్వీకరిస్తాడు. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన తర్వాత బ్రూక్ మాట్లాడాడు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడనని..  తన కెరీర్ అంతటా తిరుగులేని మద్దతు ఇచ్చినందుకు తన కుటుంబం, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని బ్రూక్ చెప్పాడు. మే నెలాఖరులో ఇంగ్లాండ్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్ కెప్టెన్ గా బ్రూక్ కు తొలి సిరీస్.    

 హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు బ్రూక్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వన్డేలకు స్టోక్స్ ను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు ప్రచారం జరిగినా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం బ్రూక్ పై నమ్మకముంచింది. జనవరి 2022లో ఇంగ్లాండ్ తరుపున అరంగేట్రం చేసిన బ్రూక్.. ఇప్పటి వరకు 26 వన్డేలు, 44 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 

Also Read :  75 మ్యాచ్‌లకు ఒకసారి ఆడతాడు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 28) బట్లర్ తన కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని అధికారికంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా పరాజయాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. బట్లర్ టీ20, వన్డేల నుంచి నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో హ్యారీ బ్రూక్ ఇక నుంచి వన్డే, టీ20 కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే బ్రూక్ ను టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ కొనసాగనున్నాడు.