భారత్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు వైస్ కెప్టెన్ ను ప్రకటించింది. సూపర్ ఫామ్ లో ఉన్న యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ గా బట్లర్ కొనసాగుతుండగా.. సీనియర్లపై వేటు వేయడంతో వైస్ కెప్టెన్ ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే ఫామ్ లో ఉన్న బ్రూక్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు నమ్మకముంచింది. జనవరి 22 నుంచి టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ నుంచి బ్రూక్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తాడు.
ALSO READ | IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
గత ఏడాది బట్లర్ గైర్హాజరీతో ఇంగ్లాండ్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన బ్రూక్..తన తొలి సెంచరీతో రికార్డ్ పట్టేశాడు. అతి చిన్న వయసులో ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 94 బంతుల్లో 13 ఫోర్లు.. 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి వన్డే కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 25 సంవత్సరాల 215 రోజుల వయస్సులో బ్రూక్ సెంచరీ సాధించి ఇంగ్లాండ్ భవిష్యత్ స్టార్ గా కితాబులందుకున్నాడు. టెస్టుల్లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్న ఈ యువ ప్లేయర్ వన్డేల్లోనో అదే జోరు కొనసాగించాలని ఇంగ్లాండ్ మ్యానేజ్ మెంట్ ఆశిస్తుంది.
26 ఏళ్ళ బ్రూక్.. 2022 లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఫార్మాట్ ఏదైనా ఈ ఇంగ్లీష్ యువ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 39 టీ20ల్లో 707 పరుగులు.. 20 వన్డే మ్యాచ్ ల్లో 719 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్ లోనూ టాప్ ఫామ్ లో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ లో ఇప్పటివరకు 9 సెంచరీలు.. 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Harry Brook appointed Vice Captain of the England white ball team. pic.twitter.com/2yyGDr0VIG
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025