
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి విత్‌డ్రా అయిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్‌ను తమ జట్టులోకి తీసుకుంది. గత సీజన్‌లో సన్ రైజర్స్‌కు ఆడిన బ్రూక్‌ను వేలంలో ఢిల్లీ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, తన అమ్మమ్మ మృతి కారణంగా బ్రూక్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ నేపథ్యంలో రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో లిజాడ్‌ను ఢిల్లీ టీమ్‌లోకి తీసుకుంది. 30 ఏండ్ల లిజాడ్ సౌతాఫ్రికా తరఫున 11 టీ20ల్లో పోటీ పడ్డాడు.