
- ఇంగ్లండ్ టీమ్‌లోకి డాన్ లారెన్స్
లండన్: ఇండియాతో జరిగే ఐదు టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దాంతో బ్రూక్ స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ డాన్ లారెన్స్‌ను టీమ్‌లో చేర్చినట్టు ఇంగ్లండ్ బోర్డు ఆదివారం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ నెల 25న మొదలయ్యే సిరీస్ కోసం అబుదాబీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి బ్రూక్ టీమ్‌తో కలిసి వచ్చాడు. కానీ, వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ తిరిగి వెళ్లిపోయాడని ఈసీబీ తెలిపింది. తను ఇండియా రావడం లేదని వెల్లడించింది. 26 ఏండ్ల లారెన్స్ సోమవారం ఇంగ్లండ్ టీమ్‌లో చేరుతాడని తెలిపింది.
ఇండియా ప్రాక్టీస్ షురూ
టెస్టు సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ప్లేయర్లు చెమటోడ్చారు. సోమవారం నుంచి ఇండియాతో పాటు ఇంగ్లండ్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొంటుంది.