ఐపీఎల్ 2024 సీజన్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22 న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ ఆడేందుకు స్టార్ ప్లేయర్లతో పాటు యంగ్ ప్లేయర్లు ఆసక్తి చూపిస్తుంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం ఒకొక్కరిగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ క్యాష్ లీగ్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐపీఎల్ నుంచి వైదొలిగారు. కొన్ని రోజుల క్రితం జాసన్ రాయ్ దూరమైతే తాజాగా హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తానికి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వలన బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.దీంతో అతని స్థానంలో ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎంపిక చేసింది. బ్రూక్ ను 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూ.4 కోట్లకు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
32 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2024 నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. గతంలో ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఓ పత్రికా ప్రకటన ద్వారా అభిమానులకు తెలియజేసింది. బెన్ స్టోక్స్ తన పనిభారాన్ని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన స్టోక్స్ మళ్ళీ జూన్ లో టీ20 ప్రపంచకప్ కోసం తాజాగా ఉండాలని స్టోక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
జో రూట్ 2023 నవంబర్ 25 న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఆడడం లేదని రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది. ఈ స్టార్ ఆటగాడు IPL 2024 నుండి వైదొలగాలని నిర్ణయిచుకున్నట్టు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలియజేసింది. 2024లో టెస్టు క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని రూట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రూట్ నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటాం అని రాజస్థాన్ జట్టు డైరెక్టర్ కుమారా సంగక్కర తెలియజేశాడు.
జాసన్ రాయ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి సీజన్ లో వేలంలో అమ్ముడుపోవడం.. సీజన్ ప్రారంభానికల్లా ఐపీఎల్ కు దూరమవ్వడం.. గత మూడేళ్ళుగా రాయ్ విషయంలో ఇదే రిపీట్ అవుతుంది. దీంతో ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ఇతని స్థానంలో మరో ఇంగ్లాండ్ ఆటగాడు పిల్ సాల్ట్ కు అవకాశం దక్కింది.
32 ఏళ్ళ రూట్ ఐపీఎల్ 2023లో భాగంగా తొలిసారి వేలంలో కోటి రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఈ సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. గతేడాది స్టోక్స్ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇక బ్రూక్ మాత్రం టోర్నీ అంతటా ఆడాడు. 13 కోట్లా భారీ ధరకు అమ్ముడుపోయి ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమయ్యాడు.
First Jason Roy, and now Harry Brook, two England batters have withdrawn from IPL 2024, citing personal reasons.
— CricTracker (@Cricketracker) March 13, 2024
What's your take on this? pic.twitter.com/9SawAQqzkv