ఆఫ్గాన్కు భారత్ ఆపన్నహస్తం

ఆఫ్గాన్కు భారత్ ఆపన్నహస్తం

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్గనిస్థాన్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న ఆ దేశానికి 50వేల టన్నుల గోధుమలు, ఔషధాలను పంపేందుకు సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా 50 ఆఫ్గాన్ ట్రక్కుల్లో 2,500 టన్నుల గోధుమలను పంపింది. అట్టారీ - వాఘా బార్డర్ వద్ద భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ జెండా ఊపి లారీలను సాగనంపారు. ఈ కార్యక్రమానికి ఇండియాలో ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్ ఫరీద్ తో పాటు పలువురు హాజరయ్యారు. రానున్న 2 - 3నెలల్లో మానవతా దృక్పథంతో మరిన్ని సరుకులు పంపనున్నట్లు హర్షవర్థన్ ప్రకటించారు. 

వాస్తవానికి భారత్ ఆఫ్గాన్కు ఆహార ధాన్యాలను పంపుతామని 3 నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఆ వాహనాలను తమ భూభాగంలోకి అనుమతించేందుకు పాక్ నిరాకరించింది. దీంతో సరుకులు పంపడం ఆలస్యమైంది. తాజాగా సరుకులను తమ దేశం గుండా పంపేందుకు పాకిస్థాన్ అనుమతించడంతో ఆఫ్ఘాన్కు సాయం అందించేందుకు మార్గం సుగమమైంది. 

For more news..

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్

యూపీ నాల్గో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం