స్టార్ ఆటగాళ్లకు షాక్...టీమ్లో నో ఛాన్స్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను కామెంటేటర్ హర్షా భోగ్లే అవమానించాడు. వరల్డ్ బెస్ట్ బ్యాట్సమన్ గా పేరొందిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భోగ్లే షాకిచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లతో భారత టీ-20 జట్టును హర్షా భోగ్లే ప్రకటించాడు. అయితే ఈ జట్టులో రోహిత్, కోహ్లీలకు భోగ్లే స్థానం ఇవ్వలేదు. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జడేజాలను అతను పట్టించుకోలేదు.

ఓపెనర్లుగా రాహుల్ ద్వయం..
హర్షా భోగ్లే  భారత బెస్ట్ టీ-20 జట్టు ఓపెనర్లుగా రాహుల్ త్రిపాఠి, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. మిడిలార్డర్‌లో  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, గుజరాత్ సారథి హార్థిక్ పాండ్యా చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్గా దినేష్ కార్తీక్ ఎంపికయ్యాడు. 7వ ప్లేస్లో రవిచంద్రన్ ఆశ్విన్కు చోటిచ్చాడు.  ఓపెనర్లుగా ఎంపికైన కేఎల్ రాహుల్..ఈ సీజన్లో 15 మ్యాచ్‌ల్లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక రాహుల్ త్రిపాఠి 14 మ్యాచ్‌ల్లో 413 పరుగులు సాధించాడు. మిడిలార్డర్కు ఎంపికైన RRకెప్టెన్ సంజూ శాంసన్‌ 16 మ్యాచ్‌ల్లో 444 పరుగులు చేశాడు. MI బ్యాట్సమన్ సూర్యకుమార్ యాదవ్‌ ఆడింది  8 మ్యాచ్‌లే అయినా...3 హాఫ్ సెంచరీలతో 303 రన్స్ కొట్టాడు.  గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా 14 మ్యాచ్‌ల్లో  4 హాఫ్ సెంచరీలతో 453 పరుగులు సాధించాడు.  బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 

అనూహ్యంగా బుమ్రాకు చోటు..
తన జట్టుకు బుమ్రాను బౌలింగ్ సారథిగా భోగ్లే ఎంపిక చేశాడు. అతనికి తోడు మోసిన్ ఖాన్, హర్షల్ పటేల్కు అవకాశం ఇచ్చాడు. స్పిన్నర్గా చాహల్ ను సెలక్ట్ చేశాడు భోగ్లే. ముంబై బౌలర్ బుమ్రా ఈ సీజన్లో పెద్దగా రాణించింది లేదు. ఎంతో అనుభవం ఉన్న బుమ్రా..14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లే తీశాడు.  మోహ్‌సీన్ ఖాన్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు దక్కించుకున్నాడు. మరో హర్షల్ పటేల్ 15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొడితే..చాహల్ 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. అతని పర్పుల్ క్యాప్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్ లైనప్లో బుమ్రాను ఎంపిక చేసిన భోగ్లే...సత్తా చాటిన  షమీ, ఉమేశ్ యాదవ్‌లను మాత్రం సెలక్ట్ చేకపోవడం గమనార్హం.