పెర్త్ టెస్టు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్న ఈ మ్యాచ్ లో మూడు రోజుల్లోనే ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుంది. 7 వికెట్లకు 67 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టార్క్ (22) జోష్ హాజిల్‌వుడ్ (6) ఉన్నారు. భారత బౌలర్లు చివరి వికెట్ తీయడానికి శ్రమిస్తున్నారు. క్యారీ , లియాన్ త్వరగానే ఔటయ్యారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో స్టార్క్, హర్షిత్ రానా ల మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇన్నింగ్స్ 30 ఓవర్లో ఐదో బంతిని మిచెల్ స్టార్క్ కు హర్షిత్ రానా బౌన్సర్ విసిరాడు. ఈ బంతిని డిఫెన్స్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ డిఫెన్స్ చేయబోతే అది మిస్ అయ్యి స్లిప్ దగ్గరకు వెళ్ళింది. రానా బౌన్సర్ కు స్టార్క్ ఫన్నీగా స్పందించాడు. నీ కంటే నేను ఫాస్ట్ గా బౌలింగ్ చేయగలను.. నాకు చాలా మెమరీ పవర్ ఉంటుంది. అని సరదాగా కామెంట్ చేశాడు. దీనికి హర్షిత్ రానా కూడా స్టార్క్ వైపు చూస్తూ నవ్వి వెళ్ళిపోయాడు.
వీరిద్దరూ ఐపీఎల్ సీజన్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే వీరు సరదాగా మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. రానాను కేకేఆర్ రిటైన్ చేసుకోగా.. స్టార్క్ ను రిలీజ్ చేసింది. నవంబర్ 22 నుంచి ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. కేకేఆర్ RTM కార్డు ద్వారా స్టార్క్ ను తీసుకుంటే మరోసారి ఒకే జట్టులో స్టార్క్, రాణాలను చూడొచ్చు.
Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2
— cricket.com.au (@cricketcomau) November 23, 2024