
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే ఈ యువ బౌలర్ కు చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఇంగ్లాండ్ ఓపెనర్ పిల్ సాల్ట్ ధాటికి ధారాళంగా పరుగులు సమ్పర్పించుకున్నాడు. తొలి ఓవర్ లోనే 11 పరుగులు ఇచ్చాడు. రెండో ఓవర్ అద్భుతంగా వేసి మెయిడిన్ ఓవర్ వేశాడు. తన మూడో ఓవర్ లో సాల్ట్ శివాలెత్తాడు. ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సిక్సులు.. రెండు ఫోర్లున్నాయి.
తొలి మూడు ఓవర్లలోనే రాణా 37 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్ర మ్యాచ్ లో భారత్ తరపున ఒకే ఓవర్లో అత్యధిక (26) పరుగులు సమర్పించుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే తన నాలుగో ఓవర్లో రాణా పుంజుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లో పడేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ మూడో బంతికి డకెట్ ను ఆ తర్వాత చివరి బంతికి బ్రూక్ ను ఔట్ చేశాడు.
ALSO READ | IND vs ENG: కోహ్లీ, పంత్‌లపై వేటు పడినట్టేనా..! అసలేం జరిగింది..?
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ బట్లర్ (16), లివింగ్ స్టోన్ (0) ఉన్నారు. ఓపెనర్లు సాల్ట్ (43), డకెట్(32) ఇంగ్లాండ్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. రూట్(19), బ్రూక్(0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీసుకున్నాడు. జడేజాకు ఒక వికెట్ లభించింది.
Phil Salt smashed Harshit Rana for 26 runs in an over ??
— CricketTimes.com (@CricketTimesHQ) February 6, 2025
?: Disney+Hotstar#Cricket #INDvsENG #harshitrana #philsalt pic.twitter.com/05YnoOxRJh