పెర్త్ టెస్టులో అద్భుతమైన క్యాచ్ ఒకటి నమోదయింది. దాదాపు చేజారిందనుకున్న క్యాచ్ ను ఆసీస్ ఆటగాళ్లు ఒడిసి పట్టారు. ఇన్నింగ్స్ 47 ఓవర్ నాలుగో బంతిని ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ లెంగ్త్ బాల్ వేశాడు. ఈ బంతిని హర్షిత్ రానా కట్ చేయగా. అది స్లిప్ లో క్యాచ్ గా వెళ్ళింది. ఈ బంతిని మెక్‌స్వీనీ ఒక చేత్తో డైవ్ చేసి పట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో బంతి చేతిలో పడినట్టే పడి జారింది. అక్కడే స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్నస్ లబు షేన్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో హర్షిత్ 7 పరుగులకే ఔటయ్యాడు.
ALSO READ | IND vs AUS: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 150 పరుగులకే కుప్పకూలిన భారత్
రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో విజృంభించి భారత్ ను ఆస్ట్రేలియా కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రానాకు ఒక వికెట్ దక్కింది.
#bordergavaskartrophy2024
— TN Streamline (@TNStreamline) November 22, 2024
8th WICKET!
46.4: Harshit Rana 7(5) ct Marnus Labuschagne b Josh Hazlewood, India 128/8#BGT #BorderGavaskarTrophy #Harshitrana #TNStreamline pic.twitter.com/sjEYHe8C5U