IND vs BAN 2024: బంగ్లాదేశ్‌తో నేడు రెండో టీ20.. టెన్షన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్

IND vs BAN 2024: బంగ్లాదేశ్‌తో నేడు రెండో టీ20.. టెన్షన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్

పూణే వేదికగా నేడు (అక్టోబర్ 9) బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ రెండో వన్డేకు సిద్ధమవుతున్నాయి. తొలి టీ20లో బంగ్లాను చిత్తు చేసిన యువ  టీమిండియా నేటి మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని జట్టు బుధవారం జరిగే రెండో టీ20లోనూ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పని పట్టేందుకు రెడీ అయింది. మరోవైపు బంగ్లాదేశ్ భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది.

తొలి మ్యాచ్ లో ఓడిపోయినా తాము పుంకుకుంటామని బంగ్లా కెప్టెన్ నజీముల్ శాంటో తెలిపాడు. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పలువురు స్టార్ ప్లేయర్లు, సీనియర్లకు రెస్ట్ ఇచ్చి కుర్రాళ్లతో బరిలోకి దిగినప్పటికీ గ్వాలియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా తిరుగులేని ఆట చూపెట్టింది. లిటన్ దాస్‌‌‌‌‌‌‌‌, మహ్ముదుల్లా తదితరులు మెరుగ్గా ఆడితేనే ఆతిథ్య జట్టుకు కనీసం పోటీ అయినా ఇవ్వగలదు. 

ఈ మ్యాచ్ విషయాన్ని పక్కన పెడితే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆ జట్టు ప్లేయర్ హర్షిత్ రాణాకు నేడు జరగబోయే మ్యాచ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కితే అతడు క్యాప్డ్ ప్లేయర్‌ గా మారిపోతాడు. 2025 మెగా ఆక్షన్ కు ముందు ప్రకటించిన రూల్స్ ప్రకారం అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించబడతాడు.

Also Read:-టీమిండియా సిరీస్‌కు న్యూజిలాండ్ స్క్వాడ్ ప్రకటన

అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ గా తీసుకుంటే వారికి రూ. 4 కోట్లు ఇచ్చినా సరిపోతుంది. ఇప్పటికే తొలి టీ20లో నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ భారత్ తరపున అరంగేట్రం చేసి క్యాప్డ్ ప్లేయర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఒకవేళ హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు దక్కితే అతన్ని  రిటైన్ చేసుకోవాలంటే కనీసం రూ.11 కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువగా చెల్లించాల్సిందే. ఈ విషయమే ఇప్పుడు కేకేఆర్ ను కలవరపెడుతుంది.

ఈ సిరీస్ ముందు వరకు హర్షిత్ ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ గా తీసుకునే ఉద్దేశ్యంలో కేకేఆర్ ఉంది. నేడు జరిగే రెండో టీ20 మ్యాచ్ లో హర్షిత్ రాణాకు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. అయితే భారత్ నేడు జరిగే మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ వచ్చింది కాబట్టి అతన్ని మూడో టీ20లో ఆడించే అవకాశాలు ఉన్నాయి.