ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను ఇంగ్లాండ్ వణికిస్తోంది. 231 పరుగుల లక్ష్యంతో దిగిన రోహిత్ సేన విజయం కోసం కష్టపడుతుంది. లంచ్ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 70 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. తొలి వికెట్ కు రోహిత్, జైస్వాల్ 42 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చినా.. ఆ తర్వాత 21 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో రాహుల్ (9) అక్షర్ పటేల్ (4) ఉన్నారు.
భారత్ గెలవాలంటే మరో 161 పరుగులు చేయాలి. మూడు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్టిలి మూడు వికెట్లు తీసుకొని టీమిండియాను చావు దెబ్బ తీసాడు. రోహిత్ శర్మ 7 ఫోర్లతో 39 పరుగులు ఔటవ్వగా.. జైస్వాల్ 15, గిల్ పరుగులేమీ చేయకుండా ఔటయ్యారు. జైస్వాల్, గిల్ ను పక్కనపెడితే కెప్టెన్ రోహిత్ ఔటవ్వడం టీమిండియాకు మైనస్ గా మారింది. అంతకముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆలౌటైంది. పోప్ 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను రేస్ లో ఉంచాడు. రెహన్ అహ్మద్ 28, టామ్ హార్టిలి 34 పరుగులు చేసి పోప్ కు సహకరించారు.
Skipper Rohit Sharma OUT! ?
— Sportskeeda (@Sportskeeda) January 28, 2024
Tom Hartley and England get their third ?
??: 63/3 (Need 168 runs to win)
?: Jio Cinema #RohitSharma #INDvENG #Cricket #TomHartley #Sportskeeda pic.twitter.com/tRo3UCpd90