ఖమ్మం టౌన్, వెలుగు : సిటీలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి ట్రైల్ బ్లేజర్ అవార్డు అందుకున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషనల్ మ్యాగజైన్ వారు నిర్వహించిన జాతీయ విద్యా కార్యక్రమంలో భాగంగా పార్వతి రెడ్డికి ఈ అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని 20 సీబీఎస్ఈ స్కూళ్లకు అందజేసిన అవార్డులలో పార్వతి రెడ్డికి అవార్డు వరించడం పట్ల స్కూల్ కరస్పాండెంట్ పి. రవి మారుత్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
హార్వెస్ట్ స్కూల్ ఆధ్వర్యంలో వనమహోత్సవం
సిటీలోని పాకబండ బజార్ లో ఉన్న హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం చెరుకూరి గార్డెన్స్ లో వేయి మంది స్టూడెంట్స్ తో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ కరస్పాండెంట్ పి.రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో స్ప్రింగ్ లీఫ్ ప్రిన్సిపల్ ఎం.పి.రాజన్,ప్రీతి, ప్రైమరీ స్కూల్ ఇన్చార్జ్ చందన, టెండర్ రూట్ హెచ్ఎం ఆసీమా, అకాడమిక్ ఇన్చార్జ్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.