
ఖమ్మం టౌన్, వెలుగు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు నిర్వహించే జూనియర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో హార్వెస్ట్ స్టూడెంట్స్ అత్యుత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్స్ సాధించినట్లు విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్ తెలిపారు. గతేడాది ఆగస్టులో నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫస్ట్ లెవెల్‌లో 42 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న నిర్వహించిన సెకండ్ లెవల్ లో 8మంది ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, జేఎంఓ అవార్డు పొందినట్లు పేర్కొన్నారు.
గోల్డ్ మెడల్ ఈషా సింగ్ సాధించగా, అర్జున్, కృష్ణ సుచేతన్ సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరితో పాటుఅభిరామ్ సుశాల్, లలిత్, హర్షవర్ధన్, నిరూపమ్, కార్తీక కన్సోలేషన్ బహుమతులు సాధించారన్నారు. ఈ సందర్భంగా గురువారం హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్. పార్వతి రెడ్డి, ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు స్టూడెంట్స్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఐఐటీ బ్రాంచ్ ఇంచార్జ్ జి. ఉమామహేశ్వరరావు,కె.నాగరాజు
పాల్గొన్నారు.