అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 30 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఒక లారీ, మూడు లే లాండ్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. బియ్యంను సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.