90 అసెంబ్లీ స్థానాలు గల హర్యానా అసెంబ్లీకి శనివారం(అక్టోబర్ 5) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు భారీ ఎత్తున క్యూ లైన్లలో నిల్చొని ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారత మహిళా షూటర్, పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ ఓటేశారు. తండ్రి రామ్ కిషన్ భాకర్‌తో కలిసి చర్ఖీ దాద్రీలోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. 22 ఏళ్ల మను ఓటేయడం ఇదే మొదటిసారి.
ఓటేసిన అనంతరం మను భాకర్ దేశంలోని యువతకు బలమైన సందేశాన్ని పంపారు. ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. యువత తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించాలని, దేశ నాయకులను ఎన్నుకోవడంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
#WATCH | Olympic medalist Manu Bhaker casts her vote at a polling station in Jhajjar for the #HaryanaElection2024 pic.twitter.com/jPXiQ2zwJf
— ANI (@ANI) October 5, 2024
90 అసెంబ్లీ స్థానాలకు గానూ మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 101 మంది మహిళలు, 464 మంది స్వతంత్ర అభ్యర్థులు. అక్టోబర్ 8న జమ్మూ కాశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.