గ్రేట్ కంపెనీ : ఆఫీస్ బాయ్ తో సహా కార్లు ఇచ్చిన ఓనర్

హర్యానాలోని పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లను బహుమతిగా ఇచ్చాడు. కంపెనీ డైరెక్టర్ భాటియా తన కంపెనీలో 12 మంది 'స్టార్ పెర్ఫార్మర్స్' ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చారు.  మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని కంపెనీ యోచిస్తోంది.   బహుమతిని అందుకున్నవారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు.  

ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారి నిబద్ధత, విశ్వాసం కోసం రివార్డ్‌లు అని భాటియా తెలిపారు.  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కార్లను అందుకున్న కొంతమంది ఉద్యోగులకు డ్రైవింగ్ కూడా రాదు.  కలలో కూడా ఊహించని ఈ అనూహ్య బహుమతికి వారు అవాక్కయ్యారు. 

ALSO READ :- Bharateeyudu 2 An Intro : కమ్ బ్యాక్ ఇండియా..శంకర్ భారతీయుడు2 ఇంట్రో టీజర్ రిలీజ్..