- పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నిర్ణయం
న్యూఢిల్లీ: పక్కాగా గెలుస్తామనుకున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ దీపక్ బబారియా రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు.
ఎన్నికల ఫలితాల రోజే తాను ఇన్చార్జ్ పోస్టుకు రాజీనామా చేస్తూ లేఖను పార్టీ హైకమాండ్‌కు పంపానని, అయితే హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. పార్టీ పక్కాగా గెలుస్తుందని భావించిన రాష్ట్రంలో ఓడిపోవడం చాలా బాధాకరం. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశా” అని దీపక్ తెలిపారు.