హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ప్రశాతంగా ముగిసింది. శనివారం (అక్టోబర్ 5, 2024) సాయంత్రం 5గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్నిర్వహించారు. వెయ్యి 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.
శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ఓటింగ్ శాతం నమోదు చేసింది. పాల్వాల్‌లో అత్యధికంగా 27.94 శాతం, పంచకులలో అత్యల్పంగా 13.46 శాతం నమోదయ్యాయి.
Also Read :- 2 వేల కోట్ల డిపాజిట్.. 271 ఎకరాల భూములు
ఈ ఎన్నికల్లో సైనీ, హుడా, ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్, JJP దుష్యంత్ చౌతాలా వంటి ప్రముఖ అభ్యర్థులతో సహా మొత్తం 1,027 మంది అభ్యర్థలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైనీ, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రతిపక్ష నేతలు భూపిందర్ సింగ్, కుమారి సెల్టా, రణదీప్ సింగ్ సూర్జేవాలా వంటి ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హర్యానా రాష్ట్రంలో 2కోట్ల03లక్షల54వేల350 మంది ఓటర్లు ఉన్నారు.20వేల 632 పోలింగ్ బూత్ లలో పోలింగ్ నిర్వహించునున్నారు.1,027 మంది అభ్యర్థుల్లో 101 మంది మహిళలు, 464 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.