
- కాలుష్యంతో హర్యానాలో స్కూళ్లు మూసివేత
చండీగఢ్: హర్యానాలో వాయు కాలుష్యం తీవ్రం కావడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లను 5వ తరగతి వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని సూచిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్లను మూసివేసే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు కట్టబెడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొంది.
‘‘ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితిని అంచనా వేసి తరగతులను నిలిపివేయవచ్చు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లల్లో 5వ తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఆదేశాలను జారీ చేయవచ్చు” అని లేఖలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చెప్పింది.