పెరుగుతున్న నిరుద్యోగానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కార్మికుల గణనీయమైన కొరతను పరిష్కరించడానికి హర్యానా నుండి 10,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హర్యానా కౌశల్ రోజ్‌గర్ నిగమ్ (HKRN), 10,000 నైపుణ్యం కలిగిన కార్మికులను రిక్రూట్‌మెంట్‌ని ప్రకటించింది.
దీనికి అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉండాలి. 25 నుండి 54 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.జీతం రూ. 6, 100 NIS (ఇజ్రాయెల్ కరెన్సీ ప్రకారం) ఉంటుంది. ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్న నివేదికల మధ్య హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా, దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ల వర్క్ పర్మిట్‌లు రద్దు చేయబడిన కారణంగా కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలియజేసిన మరుసటి రోజే హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.