
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
అంబర్పేట, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బండారు వైష్ణవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం కవాడిగూడలో ఉచిత వైద్య శిబిరం, గోల్నాక డివిజన్ లంకలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, స్టేషనరీ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.
ట్రస్ట్ చైర్మన్ బండారు విజయలక్ష్మితో కలిసి బండారు దత్తాత్రేయ హెల్త్ క్యాంపును ప్రారంభించారు. విద్యార్థులకు బ్యాగ్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేపిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు రచనశ్రీ, పావని, సుప్రియ పాల్గొన్నారు.