
- హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
న్యూఢిల్లీ, వెలుగు: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై టెర్రరిస్టుల దాడి అత్యంత హేయమైన, పిరికిపంద చర్య అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో అమరుడైన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబ సభ్యులను గురువారం దత్తాత్రేయ ఫోన్‌లో పరామర్శించారు. యువ అధికారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వినయ్ నర్వాల్ దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరచిపోలేమన్నారు.