రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌ఖడ్‌‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన.. ఉగాదిని పురస్కరించుకొని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముర్ము, ధన్‌‌ఖడ్‌‌లకు గౌతమ బుద్ధుడి చిత్ర పటాలను అందజేశారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.