త్వరలో సావిత్రి జిందాల్ కూడా చేరే అవకాశం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 48స్థానాల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. ముగ్గురు ఇండిపెండెంట్అభ్యర్థులు కూడా ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దేశంలోనే అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్ కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. బుధవారం కేంద్ర మంత్రి, హర్యానా ఇన్చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఇంట్లో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ సమక్షంలో ఇండిపెండెంట్ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ బీజేపీలో చేరారు. బీజేపీ రెబల్ క్యాండిడేట్అయిన కడ్యాన్ గనౌర్ నుంచి గెలుపొందగా.. రాజేశ్ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. సావిత్రి జిందాల్ బీజేపీలో చేరికపై చర్చలు జరుగుతున్నాయని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ చెప్పారు.