రాజ్‌కోట్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హర్యానా.. విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో హిమాన్షు రాణా (116 నాటౌట్), బౌలింగ్‌లో అన్షుల్ కంబోజ్ (4/30) చెలరేగడంతో.. బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో హర్యానా 63 రన్స్ తేడాతో తమిళనాడుపై గెలిచింది.
తొలుత హర్యానా 50 ఓవర్లలో 293/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో 47.1 ఓవర్లలో 230 రన్స్‌కు ఆలౌటైంది. బాబా ఇంద్రజిత్ (64) టాప్ స్కోరర్. హిమాన్షు రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.