పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా సలార్ మూవీతో బాక్సాపీస్ హిట్ అందుకున్నారు. లేటెస్ట్గా టాలీవుడ్ నుంచి ప్రభాస్ అయోధ్య ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తుల కోసం భోజనాల ఖర్చంతా పెట్టుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం ప్రభాస్ రూ 50 కోట్ల రూపాయాలు విరాళమిచ్చారనే వార్తా వైరల్ అవుతుంది. అయితే..కోనసీమ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ..డబ్బు సంపాదించి ఇతరులతో పంచుకునే వాడు గొప్పవాడు. అలాంటి వారిలో ప్రభాస్ కూడా ఒకరు. విరాళం ఇస్తున్నాడు’ అని ఓ కార్యక్రమంలో అన్నారు. దీంతో ఈ వార్తకు బలం చేకూరింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ వార్తలపై ఇంగ్లీష్ మీడియా, ప్రభాస్ టీమ్‌ని సంప్రదించగా..ఇందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని టీమ్ చెప్పుకొచ్చింది. దీంతో అందరికీ స్పష్టత వచ్చేసినట్లు అయింది.
ఎంతో ప్రతిష్టాత్మక రామ మందిర ప్రారంభోత్సవం..ఈ నెల (జనవరి 22న) అంగరంగ వైభవంగా జరనుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానాలు అందాయి. తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులకు ఆహ్వానాలు అందుకున్నారు.
Man With Gold Heart ?
— Milagro Movies (@MilagroMovies) January 19, 2024
MLA Chirla Jaggireddy about #Prabhas Donated 50 Crores for #Ayodhya Temple Trust#AyodhaRamMandir#AyodhyaSriRamTemple#AyodhyaJanmBhoomipic.twitter.com/AxCa37r6a6