PSL 2025: మా లీగ్ మొదలవుతుంది.. IPL వదిలేసి PSL చూస్తారు: పాకిస్థాన్ స్టార్ పేసర్

PSL 2025: మా లీగ్ మొదలవుతుంది.. IPL వదిలేసి PSL చూస్తారు: పాకిస్థాన్ స్టార్ పేసర్

క్రికెట్ అభిమానులని అలరించడానికి మరో ధనాధన్ టీ20 లీగ్ సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 పదో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18న ఫైనల్ తో ముగుస్తుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ లో పండగ వాతావరణం నెలకొంది. తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ తో పోటీ పడనుండడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ ను ఎక్కువగా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ సారి రెండు లీగ్స్ క్లాష్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ లభించనుంది. 

ఈ టోర్నీకి ముందు పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన బోల్డ్ స్టేట్ మెంట్ తో ఆశ్చర్యానికి గురి చేశాడు. హసన్ మాట్లాడుతూ.. "అభిమానులు మా టోర్నమెంట్‌ను చూస్తారు. మా టోర్నమెంట్ లో ఫ్యాన్స్ కు మంచి వినోదం దొరుకుతుంది. మేము పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బాగా ఆడితే ప్రేక్షకులు ఐపీఎల్ వదిలేసి మా లీగ్ చూస్తారు". అని చెప్పాడు. హసన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ సూపర్ కింగ్స్ తరపున వార్నర్ కెప్టెన్సీలో ఆడనున్నాడు.ఇప్పటివరకు ఈ టోర్నీలో 82 మ్యాచ్ ల్లో 108 వికెట్లు పడగొట్టాడు. మరో 6 వికెట్లు తీస్తే ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 

►ALSO READ | రోహిత్, సూర్య, హార్దిక్‌లను కలిసిన UAE ఉప ప్రధాని.. దుబాయ్ 11 జెర్సీ బహుకరణ!

డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ బరిలోకి దిగుతుంది. టోర్నీ తొలి మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ తో ఇస్లామాబాద్ యునైటెడ్ తలపడనుంది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో  ఫైనల్, ఎలిమినేటర్స్ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ చెరో ఐదు మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 6 జట్లు (ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్) టైటిల్ కోసం తలపడనున్నాయి.