హసన్ అలీ భార్య సమియా అర్జూ భారతీయ సంతతికి చెందిన మహిళ. పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగి కూడా ఐదేళ్లు కావొస్తుంది. అయితే ఈమెకు ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్ తినాలని కోరిక ఉండేదట. ఈ సిటీని ఎంతగానో ఇష్టపడే సామియా ఇక్కడకి రావడం కుదరడం లేదు. అయితే ఏడేళ్ల తర్వాత భారత్ లోకి అడుగుపెట్టడంతో ఆమె కోరిక ఫలించందనుకున్నారు. కానీ హాసన్ అలీ మాత్రం ఢిల్లీ వెళ్లడం కుదరదని ఆవేదన వ్యక్తం చేసాడు.
- ALSO READ | Asian Games 2023: తెలంగాణ యువతిపై విషం చిమ్మిన తోటి అథ్లెట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ ఆరోపణలు
వరల్డ్ కప్ లో భాగంగా పాక్ జట్టు భారత్ కి వచ్చిన ఢిల్లీలో ఒక్క మ్యాచు కూడా లేదు. పాకిస్తాన్ తన ప్రపంచ కప్ మ్యాచ్‌లను చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ కోల్‌కతాతో పాటు మొత్తం ఐదు వేదికలలో ఆడుతుంది. దీంతో తన భార్య కోరిక తీర్చలేకపోతున్నందుకు బాగా బాధపడుతున్నాడు. హసన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ " నాకు పెళ్లయి అయిదేళ్లు అవుతోంది, నా భార్య ఢిల్లీ గురించి, అక్కడి స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుతుంది. నేను నిజంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఫుడ్ తినాలని ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు, అది సాధ్యం కాదు". అని తెలియజేశాడు.
సాధారణంగా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ జరిగేటప్పుడు ఆటగాళ్లు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్లకూడదని ఐసీసీ రూల్ విధించింది. దీంతో హాసన్ అలికి నిరాశ తప్పలేదు. కాగా.. నజీమ్ షా గాయంతో వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన హాసన్ అలీ న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 66 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఈ మ్యాచులో పాక్ ఓడిపోయినా హాసన్ అలీ బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు.