
ఆక్లాండ్: భారీ టార్గెట్ ఛేజింగ్‌లో హసన్ నవాజ్ (45 బాల్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 నాటౌట్), కెప్టెన్ సల్మాన్ ఆగా (51 నాటౌట్), మహ్మద్ హారిస్ (41) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. టాస్ ఓడిన కివీస్ 19.5 ఓవర్లలో 204 రన్స్‌కు ఆలౌటైంది. మార్క్ చాప్‌మన్ (94), బ్రేస్‌వెల్ (31) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
హారిస్ రవూఫ్ 3, షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత పాక్ 16 ఓవర్లలో 207/1 స్కోరు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన హసన్ ఈ మ్యాచ్‌లో దంచికొట్టాడు. హారిస్‌తో తొలి వికెట్‌కు 71, సల్మాన్‌తో రెండో వికెట్‌కు 133 రన్స్ జత చేసి గెలిపించాడు. హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 ఆదివారం మౌంట్ మాగనుయ్‌లో జరుగుతుంది.