
న్యూఢిల్లీ: గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ స్థానంలో అదే దేశానికి చెందిన విజయకాంత్ వియస్కాంత్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి తీసుకుంది. స్పిన్నర్ విజయకాంత్ లంక తరఫున ఇప్పటిదాకా ఒకే టీ20లో పోటీ పడ్డాడు. రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో 22 ఏండ్ల ఈ యంగ్‌స్టర్ సన్ రైజర్స్ టీమ్‌లో చేరాడు.