ODI World Cup 2023: మా అమ్మను కోల్పోయాను.. అయినా జట్టును సెమీస్‌కు చేరుస్తా: ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఎమోషనల్

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మొదటి నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు విజయాలను సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వడంతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను వరుసగా ఓడించి ఈ వరల్డ్ కప్ లో సంచలన విజయాలు నమోదు చేసింది.

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఆఫ్ఘనిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలవడం ద్వారా సెమీస్ కు మరింత చేరువలో నిలిచింది. ఈ మ్యాచ్ లో 64 బంతుల్లో 56 పరుగులు చేసిన ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిది మ్యాచ్ అనంతరం భావోద్వేగ వ్యాఖ్యలు చేసాడు. " మేము ఈ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ చేసాం. వరుసగా మూడోసారి ఛేజ్ చేసి గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆటతీరును తర్వాత మ్యాచ్ ల్లో కూడా కొనసాగిస్తాం. మూడు నెలల క్రితం మా అమ్మ చనిపోయింది. మా జట్టును సెమీస్ కు చేరిస్తే అంతకన్నా మా ఫ్యామిలీకి నేను అంతకన్నా ఏమి ఇవ్వగలను". అని షాహిదీ చెప్పుకొచ్చాడు.
 
ఈ వరల్డ్ కప్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 7 మ్యాచ్ లో 4 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మొత్తం 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి రెండు మ్యాచ్ లను నవంబర్ 7న ఆస్ట్రేలియాతో, నవంబర్ 10 న సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. మరి షాహిది తమ జట్టును వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరుస్తాడో లేదో చూడాలి.