కామేపల్లి, వెలుగు : మహబూబాబాద్ జిల్లా దామరవంచ గురుకుల టీజీటీ మ్యాథ్స్ టీచర్ హట్క ర్ బాలాజీ డాక్టరేట్ సాధించారు. ‘ ఏ కంపారేటివ్ స్టడీ అమాంగ్ ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ హయ్యర్ సెకండరీ స్టూడెంట్స్ ఇన్ దేయిర్ కెరీర్ అవేర్ నెస్ అండ్ అకాడమిక్ మోటివేషన్’ అంశంపై ఓయూ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ డి. బలరాములు పర్యవేక్షణలో రీసెర్చ్ పూర్తిచేశారు.
కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన బాలాజీకి 2018లో గురుకుల టీజీటీ వచ్చింది. ఓవైపు జాబ్ చేస్తూనే 2019లో మైసూర్ లోని ‘ రీజనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ లో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ’ అంశం పైన రీసెర్చ్ పూర్తిచేశారు. డాక్టరేట్ పొందిన బాలాజీని గిరిజన గురుకుల సొసైటీ ఉద్యోగులు
అభినందించారు.