అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో మనోళ్లు వరుసగా మూడో విజయం సాధించారు. తొలుత కరేబియన్ జట్టును.. తరువాత ఆతిథ్య మలేషియాను మట్టి కురిపించిన భారత మహిళలు.. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (49; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. కెప్టెన్ నికి ప్రసాద్(11), మిథిలా వినోద్(16), జోషిత(14) పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లంకేయులు 58 పరుగులకే పరిమితమయ్యారు. లంక బ్యాటర్లలో రష్మిక సెవ్వండి (15) ఒక్కరే రెండెంకెల స్కోర్ చేయగలిగారు.
భారత జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. జనవరి 26న బంగ్లాదేశ్‌తో, జనవరి 28 న స్కాట్లాండ్ జట్లతో తలపడాల్సి ఉంది.
🇮🇳 The defending champions stay unbeaten with 3 wins out of 3.
— Female Cricket (@imfemalecricket) January 23, 2025
India U19 reign supreme in Group A after a clinical 60-run win against Sri Lanka. 💫#CricketTwitter #U19WorldCup pic.twitter.com/nNkXkabhRe