జంగుబాయి జాతరను సక్సెస్ చేయాలి
ఆసిఫాబాద్, వెలుగు: కెరమెరి మండలం మహారాజ్ గుడా అటవీ క్షేత్రంలో జనవరి 2 నుంచి నిర్వహించనున్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి జాతరను సక్సెస్ చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే కోరారు. శనివారం హట్టి హాస్టల్ లో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ,జాతర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమన్వయంతో పనిచేసి జాతర సక్సస్ చేయాలని సూచించారు. డీటీడీఓ రమాదేవి, డీఎస్పీ కరుణాకర్, డీపీఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ ల్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. కెరమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ ల్యాబ్‌ను ఖుష్బూ గుప్తా తో కలిసి ప్రారంభించారు.
విద్యార్థులు పుస్తకాలు రాయడం అభినందనీయం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: జైనథ్మండలంలోని లక్ష్మీపూర్ విద్యార్ధులు తమ పాఠశాలలో జరిగిన కార్యక్రమాల గురించి కథల పుస్తకాలు రాయడం అభినందనీయమని కలెక్టర్రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టర్ జైనథ్మండలంలోని లక్ష్మీపూర్ జడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ఆధారంగా ఆరు ప్రధాన అంశాలకు సంబంధించి రాసిన ఆరోగ్య పాఠశాల- లక్ష్మీపూర్ బడి పిల్లల కథలు పుస్తకాన్ని విద్యార్థులు, టీచర్లతో కలిసి ఆవిష్కరించారు. ఇదే స్ఫూర్తిని ఇతర పాఠశాలలు ఆచరించేలా చేయాలని ఉపాధ్యాయులను కోరారు. హెచ్ఎం అశోక్, టీచర్లు పాల్గొన్నారు.
కాగజ్ నగర్ మున్సిపల్ మీటింగ్ లో లొల్లి
కాగజ్ నగర్, వెలుగు: కాగ జ్ నగర్ మున్సిపల్ ఆఫీస్‌లో శనివారం జరిగిన కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా సాగింది. వచ్చే నెలలో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జరిగిన ఈ మీటింగ్‌కు మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా అధ్యక్షతన నిర్వహించారు. ఈ క్రమంలో ఎజెండాలోని అంశాల్లో కొన్ని పనుల ఆమోదానికి తీర్మానం పెట్టగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
చర్చలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలో చేపట్టేందుకు మంజూరైన రూ.25 లక్షల టైడ్ నిధుల వినియోగంలో కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ మొదలైంది. దీంతో కొద్దిసేపటికి చైర్ పర్సన్ మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మున్సిపల్ ఆఫీస్‌కు సమీపంలో ఓ కాలేజీ వద్ద ఇటీవల నిర్మించిన గోడ పని, ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో పనితోపాటు మరో 4 పనులపై వివాదం జరిగినట్లు సమాచారం.