కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

కరీంనగర్ టౌన్ ఏసీపీగా వెంకటస్వామి 

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసీపీగా వెంకటస్వామి నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన రామగుండం కమిషనరేట్ సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఇక్కడి ఏసీపీ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీజీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచ్ చేశారు.

నేడు జిల్లాకు ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాక

కరీంనగర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్ డా.శమీం అక్తర్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బహిరంగ విచారణ నిర్వహిస్తారని ఎస్సీ అభివృద్ది శాఖ డిప్యూటీ డైరెక్టర్ 
ఎం.నాగఐలేశ్వర్ తెలిపారు.

మహిళలకు అండగా పోలీస్ అక్క

సిరిసిల్ల టౌన్, వెలుగు: మహిళల క్షేమం కోసం పోలీసులు ఎప్పుడూ ముందుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో  పద్మనాయక  ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రతి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ‘పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్క’గా ఓ మహిళా కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేస్తున్నామన్నారు.

వీరు షీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాయంగా స్కూళ్లు, కాలేజీలను సందర్శిస్తూ విద్యార్థులకు పోక్సో యాక్ట్, సెక్సువల్ వేధింపులు, ఈవ్ టీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పిస్తారన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినీత, షీ టీం ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ ప్రమీల, షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.