కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఓ కేసులో జగిత్యాల సబ్ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే సిబ్బంది హుటహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. .

జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సరెండర్ 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవ్వడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సరెండర్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా జనరల్ బాడీ మీటింగ్ లకు హాజరు కాకపోవడం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన కంప్లైంట్స్ కారణంగా సరెండర్ చేస్తున్నట్లుగా వివరించారు.

ఉరేసుకుని చికిత్స పొందుతూ ఒకరు మృతి     
 
ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి నర్సయ్య  (45) ఉరేసుకుని చికిత్స పొందుతూ గురువారం సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్ లో చనిపోయాడు.  మృతుడు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా మద్యం అధికంగా తాగుతున్నాడు. భార్య మందలించిందని ఈనెల 10 న తన ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.  భార్య పద్మ ఫిర్యాదు మేరకు ఎస్ ఐ రమాకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నూకలమర్రి నుంచి కరీంనగర్ కు బస్సు

వేములవాడరూరల్, వెలుగు: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామం నుంచి కరీంనగర్ కు వెళ్లే బస్సు గురువారం స్టార్ట్ అయింది.  మండలంలోని నూకలమర్రి నుంచి నమిలి గుండు పల్లె, వట్టెంల మీదుగా కరీంనగర్ డిపోకు చెందిన బస్సును రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంభించారు.

కోరుట్ల కు చేంజ్ మేకర్స్ అవార్డు

కోరుట్ల,వెలుగు: కోరుట్ల మున్సిపాలిటీకి అరుదైన గౌరవం దక్కింది.  ఢిల్లీలోని కేంద్ర విజ్ఞాన కేంద్రం (సెంటర్ ఫర్ సెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్-సీఎస్ఈ), హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వ హించిన చేంజ్ మేకర్స్ కంక్లేవ్ లో కమిషనర్​ తిరుపతి పాల్గొని చేంజ్ మేకర్స్ అవార్డు అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని హాబిటాట్ సెంటర్​ లోని సిల్వర్ ఓక్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుసిటీ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ (సీఎస్ఈడబ్ల్యూఏపీ) అమలులో సత్ఫలితాలను సాధించినందుకు ఈ గుర్తింపు లభించిందన్నారు.

దిష్టి బొమ్మ దహనం

కరీంనగర్ సిటీ, వెలుగు:  మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు గురువారం  దహనం చేశారు. అనంతరం పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీ లో  బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.