కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

కరీంనగర్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

కలెక్టరేట్ ఎదుట ధర్నా

సిరిసిల్ల టౌన్, వెలుగు:  తమ సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికులు శనివారం సీఐటీయూతో కలిసి జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేపడితే ఆ సమ్మెకు ఇప్పుడున్న కాంగ్రెస్ సంఘీభావం తెలిపిందని వారి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.   కార్యక్రమంలో జీపీ కార్మికులు, సీఐటీయూ  నాయకులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ చేపట్టండి

కొత్తపల్లి, వెలుగు : గర్భిణులకు వ్యాక్సినేషన్​ పూర్తిస్థాయిలో చేపట్టాలని డీఎంహెచ్​వో వెంకటరమణ వైద్యసిబ్బందికి సూచించారు. కొత్తపల్లి పీహెచ్​సీ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  హాస్పిటల్​కు వచ్చే రోగులకు ఓపీడీ సేవలు అందించాలని, హాస్పిటల్​ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని,  ఐఎల్ఆర్​, వ్యాక్సినేషన్ వాయిల్స్​ను కోల్డ్ చైన్ ఉష్ణోగ్రతలను తరచూ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి

జగిత్యాల టౌన్, వెలుగు:  శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ ఆఫీస్ లో అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై, నమోదైన కేసులపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.  విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు ,డీఎస్పీ లు రవీంద్ర కుమార్, రాములు, సీఐ లు, ఎస్సై లు సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్వోసీ మంజూరు

కోనరావుపేట,వెలుగు: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన శిరీష కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎల్ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బందితో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల 25 వేల ఆర్థిక సాయంగా  వైద్య ఖర్చులకు ఎల్ఓసీ మంజూరు చేశారు. 

సర్వారంలో కలపొద్దు 

ముత్తారం, వెలుగు  : మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీలో కాజిపల్లిని కలపవద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు ముత్తారం ఎంపీడీఓ సురేశ్‌‌‌‌‌‌‌‌కు కాజిపల్లి గ్రామస్తులు శనివారం వినతి వత్రాన్ని అందజేశారు.  ప్రస్తుతం కాజిపల్లిలో కొనసాగుతున్న లక్కారం గ్రామ పంచాయతీ గ్రామానికి  కేవలం అరకిలోమీటర్ దూరంలో ఉందని, కానీ సర్వారం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నందున తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 

కేజ్‌‌‌‌‌‌‌‌వీల్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన బైక్‌‌‌‌‌‌‌‌.. యువకుడి మృతి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: కేజ్‌‌‌‌‌‌‌‌వీల్  ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెనక నుంచి వచ్చి బైక్‌‌‌‌‌‌‌‌ ఢీకొట్టడంతో కిందపడి యువకుడు చనిపోయాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం వద్ద సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై శనివారం ఓ రైతు తన పొలాన్ని కేజ్‌‌‌‌‌‌‌‌వీల్‌‌‌‌‌‌‌‌  ట్రాక్టర్ తో దున్ని వెళుతున్నాడు.  రాజన్న సిరిసిల్ల జిల్లా చింతలటాన గ్రామానికి చెందిన యువకుడు నరేశ్ (36) పల్సర్ బైక్ పై స్పీడ్ గా వెళ్తూ  ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టి స్పాట్‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు.  అటుగా వెళుతున్న డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆగి అంబులెన్స్ కు ఫోన్ చేసి డెడ్ బాడీని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు.