రూ. 40 లక్షల అల్ఫ్రాజోలం పట్టివేత
సిద్దిపేట రూరల్, వెలుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు అల్ప్రాజోలం తరలించే వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.40 లక్షల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఎక్సైజ్ ఎస్‌హెచ్ వో శ్రీనివాస్, డీటీఎఫ్ సీఐ శ్రీధర్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ నెల 13న సిద్దిపేట నుంచి కిష్ట సాగర్ వెళ్లే మార్గంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న గడ్డ మీది రాజును పట్టుకొని తనిఖీ చేయగా రూ.25 లక్షల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నామన్నారు. 16న కాకతీయ కాలనీలో మరుపల్లి అర్జున్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ.15 లక్షల విలువ గల సరుకును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు మృతి
రాయికోడ్, వెలుగు: బొలెరో, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్ఐ నారాయణ కథనం ప్రకారం.. మండలంలోని నల్లంపల్లికి బర్దిపురం మాణయ్య (40), భార్య లక్ష్మితో కలిసి ఈ నెల15న న్యాల్ కల్ కు బైక్ పై వెళ్తుండగా అల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాణయ్య తలకు గాయం కావడంతో చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా శ్రీశైలం గౌడ్
శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామంలోని ఫ్లెమింగ్ లేబొరేటరీస్ లిమిటెడ్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికలు మంగళవారం జరిగాయి. అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ను యూనియన్ ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం, ఎంప్లాయీస్ తో కలిసి సమావేశమయ్యారు. శ్రీశైలం గౌడ్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మైసయ్య, దయాకర్, సుబ్బారావు, లక్ష్మణరావు, వెంకన్న, నర్సయ్య పాల్గొన్నారు.
రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి
న్యూస్ నెట్వర్క్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మెదక్‌జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్నాయకులు అంబేద్కర్విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు. మంగళవారం మెదక్ పట్టణం దాయర వీధిలోఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.
గజ్వేల్ పట్టణంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్గజ్వేల్ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి, ఏంఎసీ మాజీ చైర్మన్‌శ్రీనివాస్, నాయకులు రవీందర్, పాండు గౌడ్, రమేశ్ గౌడ్, రామచంద్రం, మల్లేశం, ఇంద్రసేనారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, వినతి పత్రాన్ని సమర్పించారు. జోగిపేటలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణం, నాయకులు ఖాజా పాషా, గోపాల్, దుర్గేశ్, పోచయ్య, ప్రశాంత్ కుమార్, రఫిక్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు.