నెల్లికల్ లిఫ్టు పథకంపై రివ్యూ
హాలియా, వెలుగు : ఇరిగేషన్ అధికారులతో నెల్లికల్ లిఫ్ట్ పథకం నిర్మాణంపై ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి శనివారం నాగార్జునసాగర్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్టు పథకం మొదటి ఫేస్ ను వచ్చేనెల 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. లిఫ్టు మొదటి ఫేస్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చిందని, రెండో ఫేస్ నిర్మాణ పనులు కూడా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ఆరోగ్యంపై అవగాహన
నార్కట్‌పల్లి, వెలుగు : కామినేని ఇనిస్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో శనివారం వృద్ధాప్య మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కామినేని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబాసాహెబ్ కుడగి, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
హుజూర్ నగర్, వెలుగు : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 90 లక్షల మంది ఉన్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌చేశారు.
అప్లయ్ చేసుకోండి
యాదాద్రి, వెలుగు : స్కాలర్ షిప్స్ కోసం దివ్యాంగులైన స్టూడెంట్స్ అప్లయ్ చేసుకోవాలని వెల్ఫేర్ ఆఫీసర్ కె.నర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024–-25 ఎడ్యుకేషన్ ఇయర్లో 1 నుంచి 10 వరకు చదువుతున్న దివ్యాంగులైన స్టూడెంట్స్ ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
హాలియా, వెలుగు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో టెన్త్ విద్యార్థి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామంలో జరిగింది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. మక్కపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నేతాల కిరణ్(14) కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం కిరణ్తన ఇంటి దాబాపైకి ఎక్కి బ్రష్ చేస్తున్నాడు. ఇంటిపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు అతనికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.